1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Modified: శనివారం, 3 మే 2025 (15:41 IST)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Best Cinematographer award recieving Kushender Ramesh Reddy
Best Cinematographer award recieving Kushender Ramesh Reddy
‘రజాకార్’  చిత్రంలో తన విజువల్స్‌తో అందరినీ మెస్మరైజ్ చేశాడు సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి. ఈ ‘రజాకార్’ చిత్రంలోని విజువల్స్‌కు గుర్తింపు లభించింది. 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి పురస్కారం లభించింది. కేకే సెంథిల్ కుమార్ దగ్గర ‘ఈగ’, ‘బాహుబలి 1’,‘బాహుబలి 2’  ‘RRR’ కి  చీప్  అసోసియేట్‌గా పని చేస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు ఇలా దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ కెమెరామెన్‌గా నిలిచారు. 
 
నిజాం రాజు నిరంకుశ పాలనను, రజాకర్ల దౌర్జన్యాల్ని మట్టు పెట్టి నిజాం రాజ్యాన్ని భారత దేశంలో కలిపిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. చరిత్రలో దాగి ఉన్న నిజాన్ని, ఎవ్వరికీ తెలియని వీర గాథల్ని యాటా సత్యనారాయణ ‘రజాకార్’ చిత్రంగా తెరపైకి తీసుకు వచ్చారు. ఇక ఆయన విజన్‌కు కుశేందర్ రమేష్ రెడ్డి కెమెరా తోడు అయింది. చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఈ చిత్రాన్ని మల్చడంలో ఆయన సినిమాటోగ్రఫీ ఎంతగానో తోడైంది.
 
కదిలించే విజువల్స్‌తో మెప్పించిన కుశేందర్ రమేష్ రెడ్డి ప్రస్తుతం ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డును అందుకున్నారు.  ఇక ఆయన ప్రస్తుతం వానర సెల్యులాయిడ్ , డైరెక్టర్ మారుతి సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో వస్తున్న ‘బార్బరిక్' చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే పొలిమేర దర్శకుడు అనిల్ విశ్వనాధ్ కథ కథనంతో నాని దర్శకత్వం లో అల్లరి నరేష్ హీరోగా పొలిమేర ఫెమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా ఎస్ఎస్ఎస్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ మీద చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న 12A రైల్వే కాలనీ చిత్రానికి పని చేస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తారతమ్యం లేకుండా కంటెంట్ వున్న కథలని ఎంచుకుని  తనదైన ప్రత్యేక శైలితో దర్శకుల ఆలోచలనలకి దృశ్యరూపం అందించాలని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.