శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీ.వీ.
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2023 (19:06 IST)

లక్ష్మీ సంక్రాంతికి వచింది,.ఇప్పుడు సైంధవ్ వస్తోంది : విక్టరీ వెంకటేష్

venky,sailesh and ohters
venky,sailesh and ohters
విక్టరీ వెంకటేష్ పాన్ ఇండియా చిత్రం ‘సైంధవ్’ మేకర్స్ ఈ రోజు టీజర్‌ను లాంచ్ చేయడం ద్వారా ప్రమోషన్స్ ప్రారంభించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని  అన్ని ప్రధాన పాత్రలని ఇంతకుముందు రివిల్ చేశారు. టీజర్‌లో సినిమాలోని రెండు విభిన్న కోణాలు కనిపిస్తున్నాయి. ఇది ఫ్యామిలీ డ్రామాగా ప్రారంభమైనప్పటికీ, హీరో కారణంగా పూర్తికాని పెద్ద అసైన్‌మెంట్‌ను తీసుకునే భయంకరమైన విలన్‌గా నవాజుద్దీన్ సిద్ధిఖీని పరిచయం చేయడంతో సినిమా కోర్ పాయింట్ ఆసక్తికరంగా ప్రజెంట్ చేసారు. 

నవాజుద్దీన్ సిద్ధిఖీ తన పనిని నెరవేర్చుకోవడానికి ఎంతకైనా తెగించే క్రూరమైన విలన్ గా కనిపించాడు. అతను చిన్న పిల్లలను ఎంపిక చేసుకొని, వారికి శిక్షణ ఇచ్చి, తన సంఘ వ్యతిరేక పని కోసం వారిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతను వెంకటేష్‌ను సైకో (SaiKo) అని పిలవడం హీరో హింసాత్మక స్వభావాన్ని సూచిస్తుంది. వెంకటేష్ ప్రారంభ భాగాలలో ప్రశాంతంగా, భావోద్వేగంగా కనిపిస్తారు. చివర్లో తన ఫెరోసియస్ యాక్ట్ ని చూపుతారు. ప్రత్యర్థులకు వార్నింగ్ తీరు టెర్రిఫిక్ గా వుంది.

దర్శకుడు శైలేష్ కొలను క్రైమ్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్‌లను హ్యాండిల్ చేయడంలో తన సత్తాను నిరూపించుకున్నాడు. ఇది నెక్స్ట్ లెవల్ సబ్జెక్ట్. సైంధవ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తు రూపొందించిన ప్రతి ఫ్రేమ్‌లోనూ అతని విజన్ కనిపిస్తుంది. ఎస్. మణికందన్ అద్భుతమైన విజువల్స్ అందించారు, విజువల్ వండర్ ని క్రియేట్ చేశారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ప్రతి మూమెంట్ తన స్కోర్ తో మరింతగా ఎలివేట్ చేశాడు.  గ్యారీ బిహెచ్ పదునైన ఎడిటింగ్ తో పాటు అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ మెయిన్ ఎసెట్ లో ఒకటిగా నిలిచింది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా నిర్మాణ విలువలు ఆద్యంతం గ్రాండ్‌గా ఉన్నాయి. టీజర్ ఆసక్తికరమైన సెటప్, గ్రిప్పింగ్ కథనం, అసాధారణమైన పెర్ ఫార్మెన్స్, సాంకేతిక నైపుణ్యంతో అందరినీ కట్టిపడేసింది.

విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. నా మొదటి సినిమా నుంచి ఇప్పుడు 75వ సినిమా సైంధవ్ వరకూ నన్ను ఎంతగానో ప్రేమించి ఆదరించి అభిమానిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీరు నన్ను ఎంత ప్రోత్సహించారో నాకు తెలుసు. మీ ప్రేమ అభిమానం ఆప్యాయత వలనే ఈ ప్రయాణం సాధ్యపడింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు, అభిమానులకు, చిత్ర పరిశ్రమకు, మీడియాకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సైంధవ్ టీం అందరికీ థాంక్స్. ఒక ప్రత్యేకమైన కథ కోసం ఎదురుచూస్తున్నపుడు దర్శకుడు శైలేష్ సైంధవ్ కథ చెప్పారు. బలమైన ఎమోషన్, యాక్షన్ కి స్కోప్ వున్న కథ ఇది. వెంటనే ఓకే చెప్పాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఇంటెన్స్ యాక్షన్, ఎమోషన్స్ ని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇందులో నా పాత్ర క్రేజీ అండ్ వైల్డ్ గా వుండబోతుంది. అన్నీ ఎమోషన్స్ వుంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది. ఇందులో కొత్త వెంకీని చూస్తారు. వెంకట్ ప్యాసినేట్ ప్రోస్యుసర్. అందరికీ నచ్చే మంచి సినిమా తీయాలనే తపన ఆయనలో వుంటుంది. వండర్ ఫుల్ టెక్నిషియన్స్ మణికందన్, గ్యారీ.. అందరూ చాలా కష్టపడి సినిమాని పూర్తి చేశాం. జనవరి 13న సినిమా విడుదలౌతుంది. గతంలో చంటి, కలిసుందాం రా, లక్ష్మీ సంక్రాంతికి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ సైంధవ్ వస్తోంది. పండగ రోజు తప్పకుండా ఒక మంచి సినిమా ప్రేక్షకుల చూడబోతున్నారు’’ అన్నారు.

నవాజుద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం, మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఈ పాత్ర కోసం నన్ను ఎంపిక చేసిన దర్శకుడు శైలేష్ కి థాంక్స్. వెంకటేష్ గారు వండర్ ఫుల్ యాక్టర్. వెంకట్ గారు నాకు అన్నయ్య లాంటి వారు. మీ అందరికీతో కలసి టీజర్ చుదడటం చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.