బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : గురువారం, 26 జనవరి 2017 (15:19 IST)

లావోస్ మోష‌న్ పిక్చ‌ర్స్ ప్రొడ‌క్ష‌న్ నెం-1 తొలి షెడ్యూల్ పూర్తి

నోయ‌ల్, ఎస్తేర్, శ్రీ, అర్జున్ మీన‌న్ ముఖ్య తారాగ‌ణంగా న‌టిస్తున్న ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కృష్ణ‌మోహ‌న్, న‌రేన్, శ్రీరామ్ కందుకూరి నిర్మాత‌లు. క్రాంతి వడ్ల‌మూడి ద‌ర్

నోయ‌ల్, ఎస్తేర్, శ్రీ, అర్జున్ మీన‌న్  ముఖ్య తారాగ‌ణంగా న‌టిస్తున్న ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కృష్ణ‌మోహ‌న్, న‌రేన్, శ్రీరామ్ కందుకూరి నిర్మాత‌లు. క్రాంతి వడ్ల‌మూడి ద‌ర్శ‌కుడు. షెడ్యూల్ చివ‌రి రోజున చిత్ర సెట్‌లో యూనిట్ స‌భ్యులంద‌రూ పాల్గొన‌గా హీరో శ్రీ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా నిర్వ‌హించారు. 
 
ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ 'ప్ర‌ధాన తారాగ‌ణమంతా పాల్గొన‌గా తొలి షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించాము. `స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా సాగే చిత్ర‌మిది. త్వ‌ర‌లో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తామ‌న్నారు. నిర్మాత‌లు మాట్లాడుతూ.. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు పూర్తి స‌హ‌కారం అందించ‌డంతో తొలి షెడ్యూల్ విజ‌యవంతంగా పూర్తి చేశాము. ఈ షెడ్యూల్ చివ‌రి రోజున లొకేష‌న్‌లో  హీరోల్లో ఒక‌రైన శ్రీ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ జ‌ర‌ప‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు.
 
హీరో శ్రీ మాట్లాడుతూ... ద‌ర్శ‌కుడు క్రాంతి నా కోసం ఈ చిత్రంలో ఓ ఛాలెంజింగ్ రోల్ డిజైన్ చేశారు. ఈ పాత్ర‌లో న‌న్ను చాలా కొత్తగా ఆవిష్క‌రిస్తున్నారు. ఎప్పుడెప్పుడు న‌న్ను నేను స్క్రీ‌న్‌పై చూసుకుంటానా అన్న ఉత్సాహంతో ఉన్నాను. ఈ సినిమా ప్ర‌తి ఒక్కిరికీ మంచి పేరు తెస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు.