మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (13:08 IST)

ఆ హీరోయిన్‌ను వెంటాడుతున్న దురదృష్టం

లావణ్య త్రిపాఠి. అచ్చం తెలుగమ్మాయిలా ఉంటుంది. కానీ, ఈ అమ్మడుని దురదృష్ట వెంటాడుతోంది. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ననాయన' చిత్రంలో తన నటనతో అదరగొట్టింది. ఆ తర్వాత ఆమె నటించిన పలు

లావణ్య త్రిపాఠి. అచ్చం తెలుగమ్మాయిలా ఉంటుంది. కానీ, ఈ అమ్మడుని దురదృష్ట వెంటాడుతోంది. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ననాయన' చిత్రంలో తన నటనతో అదరగొట్టింది. ఆ తర్వాత ఆమె నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి.
 
నిజానికి లావణ్య త్రిపాఠి చాలా అందంగా, నాజూగ్గా చూసేందుకు చాలా బాగా ఉంటుంది. పైగా, ఈమెకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. అయితే, ఆశించిన స్థాయిలో హిట్లు లేకపోవడం వలన, కాస్త వెనుకబడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె రెండు భారీ విజయాలను వదులుకోవడం దురదృష్టంగానే ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
 
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'గీత గోవిందం'. ఇందులో హీరోయిన్‌గా ముందుగా లావణ్య త్రిపాఠిని తీసుకోవాలని నిర్మాత దర్శకుడు భావించారు. ఇందుకోసం ఫోటో షూట్‌ను కూడా చేశారు. కానీ, చివరి నిమిషంలో ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుందని ఆ చిత్ర దర్శకుడు పరశురామ్ చెప్పారు. అప్పటికే అంగీకరించిన ఒక తమిళ సినిమా వలన లావణ్య ఈ సినిమా చేయలేకపోయిందని వివరించారు. ఆ తర్వాతనే తాము రష్మిక మందనను సంప్రదించామని చెప్పారు. 
 
అలాగే, మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ జోడీగా 'తొలిప్రేమ'లో చేసే ఛాన్స్ కూడా ముందుగా లావణ్యకే వచ్చిందట. కొన్ని కారణాల వలన ఆమె చేయలేకపోవడం వలన అది రాశి ఖన్నాకు వెళ్లింది. ఇలా రెండు భారీ హిట్లను లావణ్య వదులుకోవడం నిజంగా బ్యాడ్ లక్కే. దీనిపై లావణ్య స్పందిస్తూ, దురదృష్టం వెంటాడుతోంది.. ఏం చేయను అంటూ పెదవి విరుస్తోంది.