సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 15 జనవరి 2017 (16:26 IST)

లీసా హెడెన్ తల్లి కాబోతుందట... వామ్మో..బికినీలో పొట్టను చూపిస్తూ ఫోటో పోస్ట్ చేసింది..

లీసా హెడెన్ ఎవరో మీకు గుర్తయ్యింది. బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లాడిన లీసా టోటల్‌గా సినిమాలకు టాటా చెప్పే ఆలోచన చేస్తోందట. ఆ మధ్య తెలుగులోనూ 'రచ్చ' సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన లీసా హెడెన్.. సినిమాల వైపు దృష్టి

లీసా హెడెన్ ఎవరో మీకు గుర్తయ్యింది. బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లాడిన లీసా టోటల్‌గా సినిమాలకు టాటా చెప్పే ఆలోచన చేస్తోందట. ఆ మధ్య తెలుగులోనూ 'రచ్చ' సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన లీసా హెడెన్.. సినిమాల వైపు దృష్టి పెట్టకుండా ఫ్యామిలీపైనే ఎక్కువ కేర్ తీసుకుంటుంది. 
 
బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ ఇమేజ్‌ను బిల్డప్ చేసుకుంటోంది. 'క్వీన్' సినిమాలో కంగనతో పోటాపోటీగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. గతేడాది 'హౌస్ ఫుల్-3' సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్‌కు జోడీగా నటించింది. ఇప్పుడిప్పుడే బడా దర్శకనిర్మాతల కంట్లో పడుతున్న లీసా ఉన్నట్లుండి ఇన్స్‌స్టాగ్రామ్‌లో  పోస్ట్ చేసిన ఓ ఫొటోతో తల్లికాబోతున్నట్లు ప్రకటించింది.
 
బ్లాక్ కలర్ టూపీస్ బికినీలో ఉదరభాగాన్ని ప్రదర్శిస్తూ... త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు వెల్లడించింది. మరి కరీనా బాటలో ఈ అమ్మడు కూడా యమ్మీ మమ్మీ జాబితాలో చేరుతుందో లేదో వేచిచూడాలి. అయితే పొట్టను కప్పుకోకుండా బికినీలో అమ్మడు తల్లిని కాబోతున్నట్లు ప్రకటించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇలా కూడా ప్రెగ్నెంట్‌గా ఉన్నాననే విషయాన్ని తెలియజేయవచ్చా అంటూ సినీ పండితులు ప్రశ్నిస్తున్నారు.