శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 3 జూన్ 2017 (15:33 IST)

మగధీర కాపీనే.. నవల ఆధారంగానే సినిమా తీశారు.. సీన్లోకి ఎస్పీ చారి

మగధీర సినిమాను కాపీ కొట్టారంటూ.. బాలీవుడ్‌లో రాబ్తా పేరుతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు గీతాఆర్ట్స్ నిర్మాణ సంస్థ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. ఇంతవరకు ఓకే కానీ ప్రస్తుతం నవలా రచయిత ఎస్పీ చారి.. మగ

మగధీర సినిమాను కాపీ కొట్టారంటూ.. బాలీవుడ్‌లో రాబ్తా పేరుతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు గీతాఆర్ట్స్ నిర్మాణ సంస్థ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. ఇంతవరకు ఓకే కానీ ప్రస్తుతం నవలా రచయిత ఎస్పీ చారి.. మగధీర కూడా కాపీనే అంటున్నారు. ఎలాగంటే... 1998లో తాను రూసిన చందేరి నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారని ఆయన వాదిస్తున్నారు. 
 
ఈ లెక్కన మగధీర కూడా కాపీనంటూ అంటున్నారు. దీనిపై ఫిల్మ్ ఛాంబర్‌లో కేసు వేసినా ఎవరు పట్టించుకోలేదని, కాపీ రైట్‌యాక్ట్ కింద న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. నవల ఆధారంగా మధ్యప్రదేశ్‌లోని ఆర్చా రాజ్యానికి చెందిన ఇద్దరు ప్రేమికులు ఆత్యహత్య చేసుకుంటారు. 400 ఏళ్ళ తర్వాత వీళ్లు పుట్టి మళ్లీ పెళ్లి చేసుకుంటారు. ఈ కథ ఆధారంగానే మగధీర సినిమాను రూపొందించినట్లు ఎస్పీ చారి. 
 
దీనిపై మగధీర అభిమానులు మాత్రం మండిపడుతున్నారు. మగధీర కాపీ అయితే ఇన్నాళ్లు రచయిత ఏం చేసినట్టు? న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించలేదు? అని ప్రశ్నిస్తున్నారు.