ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 అక్టోబరు 2020 (20:04 IST)

సర్కారు వారి పాటలో మహేష్‌కి జోడీగా మహానటి.. (Video)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట సినిమాతో మాస్ లుక్‌లో రాబోతున్నాడు. పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల నేపథ్యంలో ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. బ్యాంక్ మేనేజర్ లుక్‌లో అతడు కనిపించనున్నాడు. ఈ సినిమా తొలి షెడ్యూలును అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో ప్రారంభించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై ఈ సినిమా తీస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. 
 
ఇక ఈ సినిమాకు ఇప్పటి వరకు హీరో ఎవరు అనే సందిగ్ధత ఉండేది. కానీ తాజాగా వాటికి చెక్ పెడుతూ చిత్ర యూనిట్ ఓ పోస్ట్ చేసింది. మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఈ సినిమాలో నటించబోతోందని అధికారికంగా ప్రకటించింది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. తమ టీంలోకి ఆహ్వానిస్తూ పోస్టర్ విడుదల చేసింది.
 
సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ తర్వాత మహేష్ నటించబోయే ఈ సినిమాలో ఇటీవల వరకు కూడా కీర్తి సురేష్ హీరోయిన్ అనే ప్రచారం ఇండస్ట్రీలో జరిగింది. అదే నిజమై హీరోయిన్‌గా ప్రకటించారు. దీంతో ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.