శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 15 అక్టోబరు 2020 (15:28 IST)

పరశురామ్ ప్లాన్‌కి మహేష్ ఓకే చెబుతారా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు - గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో స్టార్ట్ చేయాలి అనుకున్నారు. పరశురామ్ టీమ్ అమెరికా వెళ్లి లోకేషన్స్ చూసారు. అయితే.. టీమ్ అక్కడకి వెళ్లడానికి వీసా ప్రాబ్లమ్ వచ్చింది. దీంతో నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పటికీ కుదరలేదు.
 
ఇక చేసేది ఏం లేక జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత మహేష్‌.. త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి ప్లాన్ జరుగుతుంది.
 
 ఇప్పుడు సర్కారు వారి పాట ఆలస్యం అవుతుండడంతో త్రివిక్రమ్ మూవీని స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోను తమ సినిమానే ముందుగా స్టార్ట్ అవ్వాలని సర్కారు వారి పాట టీమ్ అనుకుంటున్నారు.
 
అందుకనే... పరశురామ్ ప్లాన్ బి రెడీ చేసాడట. అది ఏంటంటే.. అమెరికాలో కాకుండా ముందుగా హైదరాబాద్‌లో షూటింగ్ స్టార్ట్ చేయాలి. మహేష్ ఉన్న సీన్స్ అయినా ఓకే.. మహేష్ లేని సీన్స్ అయినా ఓకే. మొత్తానికి సర్కారు వారి పాట షూటింగ్ స్టార్ట్ చేయాలి అనేది ప్లాన్.
 
 మహేష్ బాబుకి ఈ విషయం ఇంకా చెప్పలేదట. త్వరలో చెప్పి.. ముందుగా షూటింగ్ స్టార్ట్ చేస్తే.. ఈ సినిమా గురించి వస్తున్న రూమర్స్ ఆగిపోతాయి అనుకుంటున్నారట. మరి... మహేష్ ఏ నిర్ణయం తీసుకుంటాడో..? పరశురామ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.