పవన్.. అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ డైరెక్టర్ ఇతనేనా?

pawan kalyan
శ్రీ| Last Modified బుధవారం, 14 అక్టోబరు 2020 (19:30 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ రీ-ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఎంసీఏ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి కానుకగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్లో మూవీ చేయనున్నారు. అలాగే హరీష్ శంకర్, సురేందర్ రెడ్డితో కూడా సినిమా చేయనున్నట్టు ఎనౌన్స్ చేసారు.

అయితే... ఊహించనివిధంగా అయ్యప్పన్ కోషియన్ మూవీ రీమేక్‌లో నటించేందుకు పవన్ ఓకే చెప్పారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు.

ఈ మూవీకి కంటిన్యూగా 30 రోజులు డేట్స్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగు నేటివిటికి తగ్గట్టుగా కథలో మార్పులుచేర్పులు చేసారు. డైరెక్టర్ సాగర్ చంద్ర స్ర్కిప్ట్ వర్క్ కంప్లీట్ చేసారు.

అయితే... దర్శకుడు ఎవరు అనేది మాత్రం కన్ఫర్మ్ కాలేదు. మలినేని గోపీచంద్, బాబీ పేరుతో పాటు డైరెక్టర్ సాగర్ చంద్ర పేరు కూడా బాగా వినిపిస్తుంది కానీ.. డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. క్రిష్‌తో చేయనున్న మూవీలో పవన్ జనవరి నుంచి జాయిన్ అవుతారు. ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి అయ్యప్ప కోషియమ్ రీమేక్‌లో జాయిన్ అవుతారని సమాచారం.


ఇంకా డైరెక్టర్ ఎవరు అనేది ప్రకటించలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అంతా సెట్ అయిన తర్వాత పూర్తి వివరాలతో ఎనౌన్స్ చేయనున్నారు. మరి.. పవన్‌ని డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.దీనిపై మరింత చదవండి :