సంక్రాంతి రేసులోకి 'వకీల్ సాబ్' - సాధ్యమేనా? (Video)

Vakeel saab
Vakeel saab
ఠాగూర్| Last Updated: గురువారం, 15 అక్టోబరు 2020 (19:23 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం "వకీల్ సాబ్". బాలీవుడ్ చిత్రం 'పింక్'కు రీమేక్. దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంటే, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి, నివేదా థామస్‌లు హీరోయిన్లు. అయితే, ఈ చిత్రం షూటింగ్ కరోనా లాక్డౌన్ తర్వాత ఇటీవలే మొదలైంది. ఈ షూటింగ్‌లో అంజలి, నివేద థామస్ తదితరులు పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తు'న్నారు.

ఇక విజయదశమి పండగ తర్వాత నుంచి హీరో పవన్ కల్యాణ్ కూడా ఈ చిత్రం షూటింగులో పాల్గొంటారని తాజా సమాచారం. లాక్డౌన్‌కి ముందే ఆయన షూటింగ్ చాలా పూర్తవడంతో, ఇక కొన్ని రోజులు షూటింగ్ చేస్తే ఆయన పార్ట్ పూర్తవుతుంది.

ఇదిలావుంచితే, దసరా పండగకి ఈ చిత్రం నుంచి ఒక అప్‌డేట్ వస్తుందని అంటున్నారు. మరి అది టీజరా? లేక మరొకటా? అన్నది త్వరలో తెలుస్తుంది. పవన్ చాలా కాలం గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. వచ్చే సంక్రాంతి పండుగకు విడుదల చేయాలన్న సంకల్పంతో నిర్మాతలు ఉన్నారు.


దీనిపై మరింత చదవండి :