మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఫిబ్రవరి 2022 (19:42 IST)

ట్రోల్స్ చేసే వారికి మంచు ఫ్యామిలీ హెచ్చరిక.. రూ.10 కోట్లు దావా వేస్తాం!

మంచు ఫ్యామిలీపై వస్తున్న ట్రోల్స్‌ను తక్షణమే తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని, రూ. 10 కోట్లు పరువు నష్టం దావా వేస్తామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు శేషుకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. 
 
మంచు విష్ణుకు చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరఫున హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు శేషు కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
 
ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల్లో మంచు ఫ్యామిలీ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేశారు. 
 
మంచు మోహన్‌బాబు కుటుంబసభ్యులపై కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి.