మీడియా ప్రతినిధులకు బుద్ధి లేదా? ఆ లోగోలు లాక్కొండయ్యా: మంచు ఆగ్రహం
మంచు మోహన్ బాబు. ఈయన గురించి తెలియనివారు వుండరు. సినీ ఇండస్ట్రీలో ఆయనది ప్రత్యేకశైలి అంటుంటారు. ఎందుకంటే ఏదైనా ముఖం మీదే చెప్పేస్తుంటారు. అంతేకాదు... ఆగ్రహం వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆగరు. అదే మరోసారి జరిగింది.
హైదరాబాదు నగరంలోని షాద్ నగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మంచు మోహన్ బాబు వచ్చారు. ఇంకేముంది, ఆయన ఎందుకు వచ్చారో తెలుసుకునేందుకు స్థానిక మీడియా ప్రతినిధులు మైకులు పట్టుకుని ఆయన వద్దకు వెళ్లారు. వారిని చూడగానే మంచువారికి చిర్రెత్తుకొచ్చింది.
ఆయన స్పందన కోసం మీడియా ప్రతినిధులు ప్రయత్నిస్తుండటంతో... మీడియా ప్రతినిధులకు బుద్ధి లేదా? వారి లోగోలను లాక్కొండయ్యా అంటూ బౌన్సర్లకు సూచన చేసారు. దీనితో అక్కడి పరిస్థితి కాస్త గందరగోళంగా మారింది. మీడియాపై అంతలా మంచు మోహన్ బాబు ఎందుకు ఫైర్ అయ్యారనేది చర్చనీయాంశంగా మారింది. ఏదో ఆస్తి విషయాన్ని ఆయన గోప్యంగా వుంచదలిచారనే ప్రచారం జరుగుతోంది.