ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (13:43 IST)

చిరంజీవి బర్త్‌డే స్పెషల్ : 'లూసిఫర్' టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్?

ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆ రోజున మెగా అభిమానులకు ఓ పండుగ రోజు. అదేసమయంలో ఈ రోజున మెగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ చేసేలా చిరంజీవి ప్లాన్ చేసినట్టు సమాచారం. 
 
ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంతో పాటు మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ చిత్రం "లూసిఫర్‌"ను తెలుగులోకి రీమేక్ చేనున్నారు. 
 
ఈ  చిత్రం ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను అదే రోజు విడుదల చేసేలా ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఇక సెట్స్‌పైకి వెళ్లడమే మిగిలివుంది.