ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (17:49 IST)

తమిళంలో అత్తారింటికి దారేది.. ప్రణీతగా ఎవరో తెలుసా?

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మాటల మాంత్రికుడు కాంబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ టాలీవుడ్‌లో ట్రెండ్‌సెట్‌ చేసింది. కలెక్షన్ల పరంగా కుమ్మేసింది. పవన్‌ నటన, త్రివిక్రమ్‌ మాటలు ఈ సినిమాను ఎప

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మాటల మాంత్రికుడు కాంబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ టాలీవుడ్‌లో ట్రెండ్‌సెట్‌ చేసింది. కలెక్షన్ల పరంగా కుమ్మేసింది. పవన్‌ నటన, త్రివిక్రమ్‌ మాటలు ఈ సినిమాను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోంది. ఈ సినిమా తమిళ హక్కులను లైకా ప్రొడక్షన్స్ కైవసం చేసుకుంది. దీన్ని సదరు సంస్థ ట్విట్టర్లో ధ్రువీకరించింది. 
 
ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా 2013లో వచ్చిన ఈ చిత్రంలో సమంత-ప్రణీత కథానాయికలుగా నటించగా, అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారు. సుందర్.సి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో పవన్ పాత్రను శింబు పోషిస్తున్నాడు. 
 
సమంత పాత్రలో మేఘా ఆకాశ్ .. నదియా పాత్రలో ఖుష్బూ కనిపించనున్నారు. ఇక తెలుగులో ప్రణీత చేసిన పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా అనే విషయంపై సినీ యూనిట్ బాగా కసరత్తు చేస్తుంది. చివరికి ప్రణీత పాత్ర కోసం కేథరిన్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఇటీవలే జార్జియాలో ఒక షెడ్యూల్ షూటింగ్‌ను ఈ సినిమా పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ హైదరాబాదులో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో ప్రణీతగా కేథరిన్‌పై సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.