గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (13:10 IST)

`అర్జున్‌రెడ్డి` గురించి నాగార్జున షాకింగ్ స్టేట్‌మెంట్‌!

Nag latest
నాగార్జున ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడ‌తాడ‌నే ప్ర‌తీతి. కొత్త‌ద‌నం కోసం అర్రులు చాస్తుంటాడు. కొత్త త‌రం ద‌ర్శ‌కుల‌ను పెట్టి సినిమాలు తీస్తుంటాడు. వారివ‌ల్లే త‌న‌కు ఇంత‌స్థాయి వ‌చ్చింద‌ని అంటుంటారు. అలా కొత్త ద‌ర్శ‌కుడితో తీసిన `శివ‌` సినిమాకూడా ఆయ‌న హిట్ అవుతుంద‌ని అనుకోలేదట‌. శివ స‌మ‌యంలో స‌మ్మెలు జ‌రుగుతున్నాయి. వాతావ‌ర‌ణ బాగోలేదు. ఏదోలా సినిమాను విడుద‌ల చేయ‌మ‌ని అంద‌రూ అన్నారట‌. దానికి ముఖ్యంగా రీరికార్డింగ్ చేయాలి. అదిలేకుండా ఏదోలా లాగించేయ‌మ‌ని అంటే నాగార్జున మ‌న‌స్సు ఒప్ప‌క ప‌ట్టుబ‌ట్టి మ‌రీ చేయించుకున్నారు. అలా బొంబే వెళ్ళి రాజాగారిని ఒప్పించి రీరికార్డింగ్‌ను చేయించారు. 
 
శివ‌ సినిమా ఆ త‌ర్వాత ట్రెండ్ సెట్ అయింది. ఎందుకు ట్రెండ్ సెట్ అవుతుందో నాకయితే తెలీదు. అదేవిధంగా `అర్జున్‌రెడ్డి` ట్రెండ్ సెట్ అయింది. రిలీజ్‌కు ముందు ఆ సినిమా గురించి అందులో న‌టించిన వారి గురించి, ద‌ర్శ‌కుడు గురించి ఎవ్వ‌రికీ ఏమీ తెలీదు. ఎవ‌రో కొత్త‌వాళ్ళు తీశార‌ట అనే తెలుసు. కానీ రిలీజ్ అయ్యాక ట్రెండ్‌సెట్‌గా నిలిచింది. దానికి చాలా కార‌ణాలు వుంటాయి. ప‌రిస‌రాలు, వాతావ‌ర‌ణం, ర‌క‌ర‌కాల కార‌ణాలు అందుకు దోహ‌ద‌ప‌డ్డాయి. క‌నుక ఏ సినిమా ఎందుకు ట్రెండ్ సెట్ అవుతుందో నాకే తెలీదు. అలా తెలిస్తే రేపు రాబోయే వైల్డ్‌డాగ్ కూడా అవ్వాలి. చూద్దాం. ఏమవుతుందో. క‌ష్ట‌ప‌డి మంచి సినిమా చేశాం` అని తెలిపారు.