గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2024 (17:27 IST)

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

Chinthapalli Rama Rao
Chinthapalli Rama Rao
విజయ్ సేతుపతి, వెట్రీమారన్‌ కలయికలో రూపొందిన 'విడుదల -1' చిత్రం ఘన విజయం తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్‌గా 'విడుదల-2' రాబోతుంది. డిసెంబరు 20న విడుదల కానుంది. శ్రీ  వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు ఈ చిత్ర  తెలుగు హక్కులను దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్నారు నిర్మాత చింతపల్ల రామారావు ఈ సందర్భంగా ఆయన బుధవారం చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకున్నారు.
 
విడుదల-2 చిత్రం ఎలా ఉండబోతుంది?
పరిపాలకుల అహంకారానికి అణచివేయబడిన సామాన్యుల నుంచి ఉధ్భవించిన ఒక అసామాన్యుడి వీర విప్లవ గాథే  'విడుదల-2'. మనతో మిళితమైన అంశాలతో కూడిన కథ.. ఇలాంటి కథలు మన నేటివిటికి సరిపోతుంది అని ఈ సినిమా తెలుగు  హక్కులను దక్కించుకున్నాను. యదార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. అణగారిని వర్గాల నుంచి ఉద్భవించిన ఓ విప్లవ కెరటం అందరిని పెట్టుబడి దారి వ్యవస్థ నుంచి ఎలా బయటపడేలా చేశారు అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
 
ఈ చిత్రం తెలుగు నేటివిటికి ఎలా సరిపోతుంది?
ఈ  చిత్రం తమిళంలో తీసిన తెలుగు నేటివిటి కథ. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు, ఇక్కడ జరిగిన సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రమిది. ఇది తమిళ దర్శకుడు తీసిన తెలుగు వారి కథ.
 
విజయ్‌సేతుపతి పాత్ర ఎలా ఉండబోతుంది?
నటుడిగా ఆయన గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఈ చిత్రంలో పెరుమాళ్‌కు పాత్రకు ఆయన నూటికి నూరు శాతం సరిపోయాడు.
 నక్సెలైట్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి నటన, పాత్రలోని ఎమోషన్‌ ఆయన పండించిన విధానం అద్భుతం. నటుడిగా విజయ్‌ సేతుపతి ప్రేక్షకుల్లో ఎంతో మంచి గుర్తింపు ఉంది. ఈ చిత్రం ఆయన పేరు మరింత పెరుగుతుంది. ప్రజాసంక్షేమం కోసం కోరిన వ్యక్తి తమ వాళ్లను కుటుంబాన్ని కూడా వదిలి ఎలాంటి త్యాగాలు చేశాడు? అనేది ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది.
 
ఇళయరాజా సంగీతం గురించి?
ఈ చిత్రానికి ఆయన నేపథ్య సంగీతం ప్రాణంగా నిలుస్తుంది. ఈ చిత్రంలో ఆయన సంగీతంతో ప్రళయరాజాలా అనిపిస్తాడు.
 
ఇంకా ఈ చిత్రంలో ప్రధాన హైలైట్స్‌ ఏమిటి?
ఈ చిత్రంలో పీటర్‌ హెయిన్స్‌ ఇప్పటి వరకు ఇండియన్‌ స్క్రీన్‌పై చూడని పోరాటాలు సమాకూర్చాడు, మంజు వారియర్‌ సహజ నటన ఈ చిత్రానికి ప్లస్‌ అవుతుంది. విజయ్‌, మంజు వారియర్‌ మధ్య ఎమోషన్స్‌ సీన్స్‌ అద్భుతంగా ఉంటాయి. ఆ సన్నివేశాలు అందర్ని కంటతడిపెట్టిస్తాయి.
 
మీరు ఈ చిత్రాన్ని తీసుకోవడానికి మహారాజా చిత్రం సాధించిన విజయం కూడా కారణం అనుకోవచ్చా?
మహారాజా చిత్రం  విజయం సాధించడం కూడా ఒక కారణం. ఈ కథాంశం కూడా నాకు నచ్చడంతో ఈ సినిమా తీసుకున్నాను.
సీక్వెల్స్‌కు హిట్స్‌ అవుతున్నాయి ఆ సెంటిమెంట్‌ కూడా ఉంది. ఆ కోవలోనే ఈ చిత్రం కూడా విజయం సాదిస్తుంది. అత్యధిక థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల చేస్తున్నాం.
 
విడుదల పార్ట్‌ వన్‌తో పొలిస్తే పార్ట్‌-2  ఎలా ఉంటుంది?
పార్ట్‌ వన్‌ కేవలం పాత్రలు ఎస్టాబ్లిష్‌ మాత్రమే జరిగింది. కథ అంతా విడుదల-2లోనే ఉంటుంది పార్ట్‌ వన్‌కు పదిరెట్టు అద్భుతంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లో విజయ్‌ సేతుపతి అత్యంత ఉన్నతమైన నటనను చూస్తారు. ఆయన ప్రతి ఫ్రేమ్‌లో ఉంటాడు.
 
ఇందులో హింస ఎక్కువగా కనిపిస్తుంది? అభ్యంతరాలు ఏమీ రాలేదా?
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. కానీ ఇది కొత్తగా క్రియేట్‌ చేసిన కథ కాదు. పూర్తి స్థాయి రియలిస్టిక్‌గా ఉంటుంది.
 
పార్ట్‌-3 ఉంటుందా?
పార్ట్‌-3 దర్శకుడి ఆలోచనను బట్టి ఉంటుంది.
 
మీ తదుపరి చిత్రాలు
శ్రీ శ్రీ రాజావారు చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే డ్రీమ్‌గర్ల్‌ అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నాం. ఇది కాక మరో రెండు సినిమాలు సెట్స్‌ మీదకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నాయి.