మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (14:30 IST)

14 ఏళ్ల తర్వాత మళ్లీ జతకట్టిన జోడీ.. సోషల్ మీడియాలో వైరల్

సెన్సేషనల్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న కోలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌ "దర్బార్‌". ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా ముంబైలో జరుగుతోంది. ఇప్పుడు నయనతార కూడా షూటింగ్‌లో భాగమైందట. గత రెండ్రోజుల నుంచి 'దర్బార్' సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ సీన్ల షూటింగ్ జరుగుతోందట.
 
నయనతార సుమారుగా 14 ఏళ్ల ముందు 'చంద్రముఖి', 'కుచేలన్', 'శివాజీ' సినిమాల్లో రజినీతో నటించింది. ఇక 'చంద్రముఖి' సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి 'దర్బార్' సినిమాలో కనిపించబోతున్నారు. 
 
ఈ సందర్భంగా నయనతార గెటప్ స్టిల్‌ను లైకా ప్రొడక్షన్, ఏఆర్ మురగదాస్ సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా, నెట్లో ఆ హోమ్లీ పిక్ వైరల్ అవుతోంది. 'దర్బార్' సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఏఆర్ మురగదాస్ ప్రత్యేక సెట్‌ను నిర్మించి, ప్రస్తుతం అక్కడే షూటింగ్ చేస్తున్నారు. 
 
ఈ సినిమాలో రజనీకాంత్‌, నయనతారతో పాటుగా యోగిబాబు, ప్రతీక్ బబ్బర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను 2020 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తోంది సినిమా యూనిట్.