బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (11:01 IST)

''దర్బార్''లో నివేదా థామస్.. రజనీకాంత్‌‍కు జోడీగా నటిస్తుందా?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ''దర్బార్'' సినిమాలో నివేదా థామస్ నటించనుంది. రజనీకాంత్ కుమార్తె పాత్రలో నివేదా థామస్ నటించనుందని టాక్ వస్తోంది. పాత్రకి ప్రాధాన్యం వుండటం వల్ల నివేదా ఒప్పుకుందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ డుయెల్ రోల్‌లో కనిపిస్తాడని సమాచారం. 
 
ఇందులో రజనీకాంత్‌ను ఎదుర్కునే ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ నటిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. 
 
ఇందులో భాగంగా రజనీకాంత్‌కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆపై జరుగుతున్న చిత్రీకరణలో నయనతార జాయిన్ అయ్యింది. ప్రస్తుతం నివేదా థామస్ కూడా దర్బార్ షూటింగ్‌లో పాల్గొంటుందని సమాచారం.