బుధవారం, 15 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 జనవరి 2025 (12:49 IST)

2025లో బిగ్ స్టార్స్, ఎపిక్ సినిమాలని అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్

Netflix Telugu Movies in 2025
Netflix Telugu Movies in 2025
2024 లో దేవర పార్ట్ 1, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సలార్ తో పాటు అనేక పాపులర్ చిత్రాతో సందడి చేసిన నెట్‌ఫ్లిక్స్ తన అప్ కమింగ్ తెలుగు చిత్రాల రిలీజ్ కు ఉత్సాహంగా ఉంది, ఇవి 2025లో థియేటర్లలో విడుదలైన తర్వాత స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటాయి. తెలుగు పరిశ్రమలోని కొంతమంది అత్యుత్తమ నటుల, కథలు, పెర్ఫార్మెన్స్ లతో ఈ చిత్రాలు తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు తీసుకువస్తాయని హామీ ఇస్తున్నాయి.
 
నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్  మాట్లాడుతూ“2024 నెట్‌ఫ్లిక్స్ ఇండియాకు అద్భుతమైన సంవత్సరం, ఎందుకంటే మన తెలుగు సినిమాలు మునుపెన్నడూ లేని విధంగా హృదయాలను గెలుచుకున్నాయి. దేవర, గుంటూరు కారం, హాయ్ నాన్న, లక్కీ భాస్కర్, సలార్, సరిపోదా శనివారం వంటి బ్లాక్‌బస్టర్‌లు ప్రపంచవ్యాప్తంగా లవబుల్ గా మారాయి, వాచ్‌లిస్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచాయి, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. అభిమానులు మరియు విమర్శకుల నుండి ప్రేమను సంపాదించాయి.
 
మనం 2025లోకి అడుగుపెడుతున్నప్పుడు, ఉత్సాహం పెరుగుతూనే ఉంది! పరిశ్రమలోని ప్రముఖ నటులు, కథలతో కూడిన స్లేట్‌తో, ఎదురుచూడటానికి చాలా ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న OG,  హిట్ 3 - ది థర్డ్ కేస్ నుండి యాక్షన్-ప్యాక్డ్ VD 12 వరకు, ఈ సంవత్సరం మరపురాని కథలు, భావోద్వేగాలు,  అద్భుతమైన ప్రదర్శనలను హామీ ఇస్తుంది.
 
లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ కాంబినేషన్ లో రాబోతున్న ఓ.జి., నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి నటిస్తున్న అనగనగా ఒక రాజు, ప్రియదర్శి, శివాజీ నటించిన Court: State vs A Nobody, సిద్ధు జొన్నలగడ్డ - జాక్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ - మ్యాడ్ స్క్వేర్, రవితేజ - మాస్ జాతర, నాగ చైతన్య, సాయి పల్లవి - తండేల్, విజయ్ దేవరకొండ 12, నాని చేస్తున్న Hit 3 - The Third Case చిత్రాలు వున్నాయి.