సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 6 జులై 2021 (20:04 IST)

ఎల‌క్ష‌న్ల గురించి ప్ర‌కాష్‌రాజ్‌కు ఆతృత - జ‌ల‌క్క్ ఇచ్చిన నెటిజ‌న్లు

prakash raj team
న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ సోష‌ల్‌మీడియాను బాగా ఉప‌యోగించుకుంటున్నారు. కొద్ది సేప‌టి క్రిత‌మే ఆయ‌న సోష‌ల్‌మీడియాలో ఎల‌క్ష‌న్స్ ఎప్పుడు ?, #JustAsking అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించి తెలుగులో రాశారు. దానికి చాలామంది ప‌లుర‌కాలుంగా స్పందించారు. ఎం.ఎల్‌.ఎ. ఎన్నిక‌లా? ఎం.పి. ఎన్నిక‌లా? మోడీ హ‌యాంలో రాబోయే ఐదు రాష్ట్రంలో ఎన్నిక‌లా?  మా ఎన్నిక‌లా?  కార్పొరేష‌న్ ఎన్నిక‌లా? లేదంటే బెంగుళూరులో ఓడిపోయిన ఎల‌క్ష‌న్ల గురించా? అంటూనే జాతివ్య‌తిరేక శ‌క్తివి నువ్వంటూ ఘాటుగానే స్పందించారు.
 
అయితే ఇటీవ‌లే తాను `మా` ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ట్లు ఓ పాన‌ల్‌ను ప్ర‌క‌టించారు. ఆ సంద‌ర్భంగా లోక‌ల్‌, నాన్ లోక‌ల్ అంటూ టీవీల్లో చ‌ర్చ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇక్క‌డ ఎవ‌రు లోక‌ల్‌? నాన్‌లోక‌ల్‌? అంటూ ప్ర‌శ్నించారు. అందుకు నాగ‌బాబుకూడా ప్ర‌కాష్‌రాజ్‌కూ స‌పోర్ట్ చేశారు. ఆ త‌ర్వాత ప్ర‌స్తుత మా అధ్య‌క్షుడు న‌రేష్ త‌న ప‌నివిధానం, ఏమేం చేశామో సేవా కార్య‌క్ర‌మాల గురించి మీడియా ముందు పెట్టాడు. ఆ త‌ర్వాత హేమ‌, జీవిత‌, మంచు  విష్ణు మా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ట్లు చెప్పారు. 
 
దీన్ని బ‌ట్టి చూస్తే ప్ర‌కాష్‌రాజ్ సోష‌ల్‌మీడియా ద్వారా మా ఎన్నిక‌ల‌ను తొంద‌ర‌ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇలా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని లేవనెత్తితే అతని ప్రశ్నకు ఎవరు సమాధానం ఇవ్వాలి. ఇలాగైనా నెటిజ‌న్ల అభిప్రాయం తెలుసుకుని దాని బ‌ట్టి ఫాలో అవ్వాల‌ని చూస్తున్న‌ట్లుగా అనిపిస్తోంది.