శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జులై 2021 (14:55 IST)

బెంగుళూరులో రేవంత్ రెడ్డి : ట్రబుల్ షూటర్‌తో భేటీ

తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడుగా నియమితులైన ఏ.రేవంత్ రెడ్డి వరుస పర్యటనలు జరుపుతున్నారు. తాజాగా ఆయన కర్నాటక రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. ఒకవైపు, తెలంగాణ ప్రాంత నాయకులనేకాకుండా, జాతీయ స్థాయి నేతలతో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. 
 
తాజాగా బెంగుళూరుకు వెళ్లిన రేవంత్ రెడ్డి.. కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్ శివకుమార్‌ను కలిశారు. ఆ తర్వాత రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్షనేత అయిన మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. కేవలం మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగింది.
 
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులును వారికి వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి.. ఇపుడు జాతీయ స్థాయి నేతలతో భేటీ కావడం గమనార్హం.