సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జులై 2021 (13:11 IST)

వనజీవి - పద్మశ్రీ రామయ్యకు అస్వస్థత

తెలంగాణ రాష్ట్రానికి చెందిన వన జీవి రామయ్య ఆదివారం అస్వస్థతతకు గురయ్యారు. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ బి వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో బి శ్రీనివాస్‌, ఏవో రాజశేఖర్‌గౌడ్‌ ఆయనకు పరీక్షలు నిర్వహించారు. 
 
ఆయనకు జరిపిన కొవిడ్‌ రాపిడ్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, బలహీనంగా ఉండటంతో ఫ్లూయిడ్స్‌ ఎక్కించి సోమవారం ఇంటికి పంపించనున్నట్లు డాక్టర్‌ సురేష్‌ తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు.