గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జులై 2021 (09:01 IST)

యూపీలోని జూన్పూరు జడ్పీ ఛైర్మన్‌గా తెలంగాణా మహిళ!

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార భారతీ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. క్రితం ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించింది. అయితే, ఈ రాష్ట్రంలో తాజాగా జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించిన తెలంగాణ మహిళ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. జాన్పూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఈమె తండ్రి కీసర జితేందర్‌ రెడ్డి కావడం గమనార్హం. 
 
ఈమె సొంతూరు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం. ఈమె తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమయంలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తర్వాత ఆమెకు యూపీకి చెందిన వ్యక్తితో వివాహం కావడంతో ఆమె అక్కడికి వెళ్లి స్థిరపడిపోయారు. ఈ క్రమంలో ఆమె అక్కడ బీజేపీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో ఆమెకు జాన్పూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి వరించింది.