మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 31 డిశెంబరు 2024 (19:37 IST)

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

Sai Pallavi
New Year 2025 కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే దేశంలోని పలు ఆలయాలు, ప్రార్థనా మందిరాలు కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ సినీ నటి సాయి పల్లవి కూడా నూతన సంవత్సర వేడుకలను పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా మందిరంలో భజనల్లో పాల్గొనడం ద్వారా నిర్వహిస్తున్నారు.
 
సీతమ్మ భక్తురాలని అవ్వాలనుకుంటున్నా
నితీష్ తివారీ బాలీవుడ్‌లో రూపొందిస్తున్న రామాయణం చిత్రంలో సాయి పల్లవి సీత పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తున్నారు. ఇటీవల, కెజిఎఫ్ స్టార్ యష్ తాను రావణ్ చిత్రంలో నటిస్తున్నట్లు వెల్లడించాడు. సాయి పల్లవిని ప్రాజెక్ట్ కోసం తీసుకోవడంలో తన సహకారం వుందని తెలిపాడు. సాయిపల్లవి అద్భుతమైన నటి అని చెప్పాడు. 
 
సాయి పల్లవి రామాయణంలో సీత పాత్ర గురించి కొన్ని వివరాలను తెలియజేసింది. ప్రస్తుతానికి తానేమీ చెప్పలేనని, సీతమ్మ పాత్రలో నటించాలంటే ముందుగా సీతమ్మగా మారేందుకు సిద్ధం కావాలి. సీతమ్మను ఓ భక్తురాలిగా వేడుకుంటున్నాను. మీరు నన్ను ఆవహించి.. నా ద్వారా నటించండని.. అంటూ సాయిపల్లవి వెల్లడించింది. తను సినిమా ద్వారా నాకు ఏది దొరికితే అది నేర్చుకుంటాను. నేను నేర్చుకున్న దాని గురించి తర్వాత చర్చిస్తాం అని సాయి పల్లవి తెలిపింది. సాయి పల్లవి చెప్పిన ఈ మాటలు రామాయణం సినిమాలో సీతమ్మ పాత్రకు ఆమె ఎంత అంకితభావంతో నటించిందో తెలియజేస్తుంది.