శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (17:53 IST)

డార్లింగ్ ప్రభాస్‌తో నీహారిక ప్రేమాయణం ... క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్ (Video)

మెగా కాంపౌండ్ నుంచి తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ నీహారిక కొణిదెల, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె. ఈమె పలువురుతో ప్రేమాయణం సాగిస్తున్నట్టు పలు రకాలైన వార్తలు వచ్చాయి. అలాంటి వారిలో హీరో ప్రభాస్ కూడా ఒకరు. ప్రభాస్‌తో నీహారిక పీకల్లోతు ప్రేమలో పడిపోయినట్టు గుప్పుమన్నాయి. వీటిపై నీహారిక స్పందించారు. 
 
హీరో వైష్ణవ్ తేజ్‌తో తనకు ఒక యేడాది వయస్సు నుంచే మంచి బాండింగ్ ఉందని చెప్పుకొచ్చింది. వైష్ణవ్ తేజ్.. హీరో సాయి ధరమ్ తేజ్ సొంత సోదరుడు. వైష్ణవ్ తేజ్ "ఉప్పెన" చిత్రంలో హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నాడు. 
 
ఇకపోతే... నీహారిక అన్న, సినీ హీరో వరుణ్‌ తేజ్‌. సాయి ధరమ్ తేజ్‌కు, వరుణ్ తేజ్‌లు మంచి స్నేహితులు. దీంతో నీహారికతో కూడా సాయి ధరమ్ తేజ్ మంచి ఫ్రెండ్‌షిప్ కొనసాగిస్తున్నాడు. 
 
ఇకపోతే, డార్లింగ్ ప్రభాస్‌తో ఉన్న పరిచయం, ప్రేమ వ్యవహారంపై స్పందిస్తూ, తమ మధ్య ప్రేమ ఉందనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పుకొచ్చింది. సంచలనం కోసం కొందరు అలాంటి వార్తలు పుట్టిస్తారంటూ తేల్చిపారేసింది.