మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 27 ఏప్రియల్ 2020 (23:24 IST)

ఆచార్యలో నిహారిక క్యారెక్టర్ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ చిత్రంపై ప్రారంభం నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కథ గురించి, చిరంజీవి క్యారెక్టర్ గురించి చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల మాత్రం ఈ సినిమా కథ గురించి ఎలాంటి క్లూ ఇవ్వలేదు. దీంతో ఆచార్యపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి అని చెప్పచ్చు. 
 
ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దు అనే రేంజ్‌కి వెళ్లాయి. ఈ మూవీ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఏంటంటే... మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక నటించనుంది. గత కొన్ని రోజులుగా నిహారిక ఇందులో నటించనన్నట్టు వార్తలు వచ్చాయి కానీ.. ఏ క్యారెక్టర్ చేయనుంది అనేది బయటకు రాలేదు. 
 
తాజా వార్త ఏంటంటే... ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి చెల్లెలి పాత్రలో నిహారిక కనిపించనున్నదని తెలిసింది. చరణ్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర ఉద్వేగ పూరితంగా ఉంటుందని అంటున్నారు. సినిమాకి చరణ్ పాత్ర హైలెట్‌గా నిలుస్తుందని.. దాదాపుగా చరణ్‌ పాత్ర అర గంట సేపు ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
 
 చరణ్‌కి, ఆయన చెల్లెలి పాత్ర పోషిస్తున్న నిహారిక మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయని... ఆ సీన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని అంటున్నారు. మరి.. ఈ సినిమాతో నిహారిక ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.