శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (10:58 IST)

ఆమ్లెట్ కోసం ఆత్మహత్యా? అక్కకొడుకుతో గొడవపడి ఆ యువతి?

omlett
ఆమ్లెట్ కోసం అక్క కొడుకుతో గొడవపడి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన  పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేటకు దివ్య భవాని (23) అనే యువతి లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి దగ్గరే ఉంటోంది. స్కూల్‌కు సెలవులు ఉండడంతో ఈమె అక్క కొడుకు కూడా కొద్ది రోజులుగా వీళ్ల ఇంట్లోనే ఉంటున్నాడు. 
 
గురువారం మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో దివ్య భవాని ఆమ్లెట్ వేసుకుంది. దాన్ని తన అక్కడ కొడుకు లాక్కొని తిన్నాడు. దీంతో ఇరువురి మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో భవానిని ఆమె తండ్రి మందలించాడు. తనను తండ్రి మందలించడంతో దివ్య భవాని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి పురుగుల మందుతాగింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.
 
వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గమధ్యలోనే ఆమె చనిపోయింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.