గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 28 డిశెంబరు 2024 (18:46 IST)

నింద చిత్రానికి అంతర్జాతీయ స్ట్రీమింగ్ కి ఆమోదం

Varun sandesh- ninda
Varun sandesh- ninda
వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన థ్రిల్లర్ నింద ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ చిత్రం ఇప్పుడు ఎమిరేట్స్, మలేషియన్ ఎయిర్‌లైన్స్‌లో ప్రసారం చేయడానికి ఆమోదించారు. దీంతో అంతర్జాతీయ ప్రేక్షకులకు విస్తరించబోతోంది. సెప్టెంబర్ 6న ETV విన్‌లో విడుదలైనప్పటి నుంచీ ట్రెండ్ అవుతున్న ఈ మూవీ ఇప్పటికే 35 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసింది.
 
యదార్థ సంఘటనల ఆధారంగా నింద మూవీని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వం వహించి, నిర్మించారు. గ్రిప్పింగ్ కథనంతో అందరినీ ఆకట్టున్నారు. ఈ సినిమాలో అన్నీ, శ్రేయ, తనికెళ్ల భరణి, భద్రం వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.
 
సినిమాటోగ్రాఫర్ రమీజ్ నవీత్ అద్భుతమైన విజువల్స్, సంతు ఓంకర్ హాంటింగ్ స్కోర్, అనిల్ కుమార్ చేసిన ఎడిటింగ్‌...నింద మూవీని స్లో బర్న్ స్టోరీ టెల్లింగ్‌లో మాస్టర్ క్లాస్ గా నిలబెట్టాయి. అంతర్జాతీయ స్ట్రీమింగ్ ఆమోదంతో నింద నెక్స్ట్ లెవెల్ కి చేరనుంది.