శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (23:44 IST)

నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ ‘నిన్నిలా నిన్నిలా’ ట్రైల‌ర్ విడుద‌ల‌

Nithy menaon, rituvarma
అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’.  బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్‌ల‌‌పై బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని.ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ట్రైల‌ర్‌ను ఫిబ్ర‌వ‌రి 5న విడుద‌ల చేస్తున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘నిన్నిలా నిన్నిలా ఓ ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌. మంచి కామెడీ, హ‌త్తుకునేలా మంచి ఎమోష‌న్స్‌, ల‌వ్ అన్ని అంశాలుంటాయి. సినిమాలో అశోక్ సెల్వ‌న్‌, రీతూవ‌ర్మ‌, నిత్యామీన‌న్ మ‌ధ్య స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ఇటీవ‌ల ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 5 ఉద‌యం 11 గంట‌ల‌కు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’  తెలిపారు. 
 
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: అని.ఐ.వి.శ‌శి 
నిర్మాత‌:  బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌
స‌మ‌ర్ప‌ణ‌:  బాపినీడు.బి
సినిమాటోగ్ర‌ఫీ:  దివాక‌ర్ మ‌ణి
సంగీతం:  రాజేశ్ మురుగేశ‌న్‌
పాట‌లు:  శ్రీమ‌ణి
డైలాగ్స్‌:  నాగ చంద‌, అనుష‌, జ‌యంత్ పానుగంటి
ఆర్ట్‌:  శ్రీ నాగేంద్ర తంగాల‌
ఎడిటింగ్‌:  న‌వీన్ నూలి
డైలాగ్స్‌:  నాగ చందు, అనుష, జ‌యంత్ పానుగంటి