ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (15:35 IST)

రజనీకాంత్ కుమార్తెగా మారిన 'జెంటిల్‌మెన్' హీరోయిన్..

తెలుగు సినిమాలకు కొన్ని నెలలపాటు దూరంగా ఉన్న నివేదా థామస్ ఈ మధ్యనే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కె.వి.గుహన్ దర్శకత్వంలో విడుదలైన '118' చిత్రంలో నటించింది. కానీ ఈ సినిమా అనుకున్నంత మంచి ఫలితాన్ని అందించలేకపోయింది. మలయాళంలో కూడా ఈమె సినిమాలు పెద్దగా హిట్ అవ్వడం లేదు. గతంలో హీరో నానీతో కలిసి నటించిన 'జెంటిల్‌మెన్', 'నిన్నుకోరి' చిత్రాలు బాగా హిట్ అయ్యినప్పటికీ ప్రస్తుతం చేతిలో ఆఫర్‌లు లేక అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. 
 
కానీ తాజా సమాచారం ప్రకారం నివేదా థామస్‌కి ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. ఈమెకు తమిళంలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఈ మధ్యనే 'పేటా' అనే సినిమాతో తమిళంలో పెద్ద హిట్‌ను అందుకున్న రజనీకాంత్ తాజాగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 
 
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రాన్ని ప్రస్తుతం #తలైవా166 అని పిలుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజనీకాంత్ కూతురిగా నివేదా థామస్ నటించనుంది. ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది కూడా. ఈ చిత్రంలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలోని రజినీకాంత్ పాత్రకు సంబంధించిన కొన్ని ఫోటోలు సైతం ఇటీవల లీక్ అయ్యాయి.