మామయ్య ఆరోగ్యం గురించి ఎన్.టి.ఆర్. వాకబు
ప్రస్తుతం సినిమారంగంతోపాటు రాజకీయ రంగంలోని ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈరోజు తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. నాకు ఈరోజు కరోనా టెస్ట్ చేస్తే కరోనా లక్షణాలు కొద్దిగానే కనిపించాయి. అందుకే వెంటనే ఇంటిలోనే ఐసొలేషన్‌లోకి వెళ్ళిపోయాను. డాక్టర్ సూచనలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నానని పేర్కొన్నారు. నిన్ననే నారా లోకేష్ కూడా కరోనా లక్షణాలు రావడంతో ఐసొలేషన్‌లో వున్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే జూ.ఎన్.టి.ఆర్. ట్విట్టర్‌లో స్పందించారు. `మామయ్యగారు మీరు త్వరగా కోలుకుని ఆరోగ్యంతో బయటకు రావాలని ఆకాంక్షిస్తున్నానని` తెలిపారు. గతంలో ఎన్.టి.ఆర్. కూడా కరోనా బారిన పడడంతో స్వచ్చంధంగా ఐసొలేషన్‌లోనే వున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే నారా చంద్రబాబునాయుడు, లోకేష్ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.