గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (11:18 IST)

కెమెరామెన్ లను ఎంకరేజ్ చేసిన ఎన్టీఆర్ - లేటెస్ట్ అప్ డేట్

NTR latest
NTR latest
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చాలా సరదాగా వుంటుంటారు. గతంలో పోలిస్తే ఆయనలోని సీరియస్ నెస్ తగ్గింది. తాజాగా మాత్రుమూర్తితోపాటు కుటుంబాన్ని తీసుకుని కర్నాటకలోని పలు దేవాలయాలను దర్శించి పునీతులయ్యారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కుటుంబం కూడా ఆయన వెంట వచ్చారు. తాజాగా ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా నటిస్తున్నారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టితో కలిసి నటిస్తారా? అని బెంగుళూరు విలేకరులు అడిగితే.. అన్నీ కుదిరితే రిషబ్ ఓకే అంటే నేను ఓకే అంటూ సరదా సంభాషణలు సాగాయి. 
 
ఇక ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సందర్భంగా ప్రమోషన్ లు నార్త్ లో చేస్తున్నారు. లేటెస్ట్ నిన్న జరిగిన ఓ ప్రాంతంలో ఎన్టీఆర్ రాగానే అక్కడ కెమెరామెన్లు సార్..సార్.. సార్.. ఒక్క లుక్ సార్.. సైన్ లుక్ అంటూ చేతులతో సంజ్న చేస్తూ అడిగారు. వెంటనే ఆయన తనదైన శైలిలో వారికి ఫొటోలకు ఫోజులిస్తూ.. చివరగా.. వారడినట్లుగా చేయి చూపించిన విధానాన్ని చూపుతూ.. సార్.. సార్.. ఓకే నా అంటూ అందరినీ నవ్వించారు. ఇదిలా వుండగా, దేవరలో ఎన్టీఆర్  సీరియస్ రోల్ ప్లే చేస్తున్నారు. ట్రైలర్ ఈరోజు సాయంత్రం విడుదలకాబోతుంది.