గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

ఆట నాది.. కోటి మీది.. జీవితాన్ని మారుద్దాం రామ్మా అంటున్న ఎన్టీఆర్

ప్రముఖ బుల్లితెర టీవీ చానెల్‌లో మరోమారు "ఎవరు మీలో కోటీశ్వరులు" అనే షోను తిరిగి ప్రారంభించనుంది. ఈ షోకు వ్యాఖ్యాతగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించనున్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. 
 
బుల్లితెర‌పై ఈ షో త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్న నేప‌థ్యంలో ఆదివారం మరో ప్రోమోను విడుద‌ల చేశారు. "జీవితాన్ని మారుద్దాం రామ్మా" అంటూ ఎన్టీఆర్ చెబుతోన్న డైలాగులు అల‌రిస్తున్నాయి.  
 
"ఇక్కడ కథ మీది.. కల మీది.. ఆట నాది.. కోటి మీది. రండి గెలుద్దాం... ఎవరు మీలో కోటీశ్వరులు" అంటూ ఎన్టీఆర్ పలికే పలుకులు ఆకట్టుకుంటున్నాయి. 
 
కాగా, గ‌తంలో ఎన్టీఆర్‌ బిగ్ బాస్ సీజ‌న్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించాడు. అది సూప‌ర్ హిట్ అయింది. 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' ప్రోగ్రాంతో మ‌రోసారి అల‌రించ‌డానికి ఎన్టీఆర్ సిద్ధ‌మ‌య్యాడు.