1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. NTR, Ram Charan get nominated in CCC Awards

ఆర్ఆర్ఆర్.. చెర్రీ రికార్డ్.. సీసీసీకి ఎంపికైన ఎన్టీఆర్, రామ్ చరణ్

rrrmovie
ఆర్ఆర్ఆర్ నటులు ఎన్టీఆర్, రామ్ చరణ్ సీసీసీ అవార్డ్స్‌కు ఎంపికయ్యారు. సీసీసీ ఉత్తమ నటుడి అవార్డు కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఇంకా క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ (సీసీసీ) అవార్డులకు నామినేట్ అయ్యారు. రెగ్యులర్ కమర్షియల్, సూపర్ హీరో చిత్రాలకు ఈ అవార్డులు ఇస్తారు.
 
టామ్ క్రూజ్ (టాప్ గన్: మావెరిక్), నికోలస్ కేజ్ (ది అన్‌బేరబుల్ వెయిట్ ఆఫ్ మాసివ్ టాలెంట్)తో పాటు మన టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నామినేట్ అయ్యారు.   
 
బాహుబలి మేకర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ అమెరికాలో సంచలనం రేపుతోంది. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని అమెరికాలో విడుదల చేయనున్నారు. 
 
"నాటు నాటు" పాట ఇప్పటికే ఆస్కార్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నామినేట్ చేయబడింది. ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్నారు. "గుడ్ మార్నింగ్ అమెరికా" టీవీ కార్యక్రమానికి హాజరై చరిత్ర సృష్టించాడు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ఫై భారీ ఫైట్ చిత్రీక‌ర‌ణ‌