గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2023 (17:30 IST)

పుట్టినరోజు దసరా లాగా జరుపుకోవాలి : నాని

Nani birthday poster
Nani birthday poster
నేచురల్ స్టార్ నాని ఇటీవల మేకోవర్‌కి అసలైన అర్థం చెప్పారు. ఒక నటుడు తాను పోషించే పాత్రలో యాప్ట్, రియల్ గా కనిపించేలా తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉందని  అద్భుతంగా చూపించారు నాని. తన తాజా పాన్ ఇండియా మూవీ ‘దసరా’లో రోజువారీ కూలీగా తన పాత్ర కోసం అద్భుతమైన మేక్ఓవర్ అయ్యారు నాని. మార్చి 24న నాని పుట్టినరోజు. తన సినిమాల పిక్స్ తో ఈసారి దసరా మనదే అంటూ ఫాన్స్ కు బూస్ట్ ఇత్చాడు. 
 
నాని ట్విట్టర్‌లో తన ప్రొఫైల్ చిత్రాన్ని మార్చారు.  దసరా లోని ఈ ఫోటో అబ్బురపరిచింది. గజిబిజి జుట్టు, గడ్డంతో రగ్గడ్ లుక్‌లో మీసాలు తిప్పుతూ కనిపించారు. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.
 
సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా, మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
మార్చి 30న దసరా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని సినిమాని బలంగా ప్రమోట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.