1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. eat 10 almonds to get vitamin E

ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి

Almonds
బాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు.
చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.
10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది.
నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్‌ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
బాదంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి వృద్ధాప్యాన్ని నియంత్రిస్తాయి.
రక్తంలో ఆల్ఫా టోకోఫెరోల్ మొత్తాన్ని బాదం పెంచుతుంది, ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.
నానబెట్టిన బాదం మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
ఆహార నిపుణుల సూచన ప్రకారం రోజుకు 8 నుంచి 10 బాదం పప్పులు తింటే చాలు.
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌‍కు అధునాతన చికిత్స