1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Myth or Fact: Do Almonds Cause Body Heat?

అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?

Almonds
మన రోజువారీ ఆహారంలో బాదం పప్పుల వినియోగం ఎప్పటినుంచో ఆదరణ పొందుతూ వస్తోంది. ఆరోగ్యకరమైన అల్పాహారంలో భాగం చేసుకోవడం నుంచి.. తీపి లేదా కారం వంటకాలకు అదనపు రుచిని జోడించడం వరకు బాదం పప్పులను అన్ని రకాలుగా ఇష్టపడుతుంటారు. బాదంకు ఇంత ఆదరణ ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసరికి ఒక సాధారణ అపోహ పదే పదే తెరపైకి వస్తూ ఉంటుంది: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?
 
ఎండాకాలంలో బాదం పప్పులు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని, లేదా వేడి వాతావరణంలో ఇబ్బంది కలుగుతుందని నమ్మి, చాలా మంది వాటిని తినడానికి వెనుకాడతారు. అయితే, ఈ ఆందోళన నిజంగా వాస్తవమేనా? లేదా కాలక్రమేణా స్థిరపడిపోయిన ఆహారపు అపోహలలో ఇదీ ఒకటా?
 
అపోహను అర్థం చేసుకోవడం
బాదం పప్పులు శరీరంలో వేడిని పుట్టిస్తాయనే నమ్మకం.. వాటి పోషక పనితీరు కంటే, కొన్ని రకాల ఆహార పదార్థాలను ప్రజలు అర్థం చేసుకునే విధానంతో ముడిపడి ఉంటుంది. బాదం పప్పులు పోషకాలతో నిండి ఉండటం, మరియు వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, పీచుపదార్థం సహజంగానే పుష్కలంగా ఉండటం వల్ల.. ఇవి బరువైన ఆహారం అని, వీటిని తింటే శరీరంలో వేడి పుడుతుందని కొందరు భావిస్తుంటారు.
 
అయితే, వేసవి కాలంలో బాదం పప్పులు తినడం మంచిది కాదని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. వాస్తవానికి, వయసు, జీవనశైలితో సంబంధం లేకుండా సమతుల్యమైన ఆహారపు అలవాట్లలో భాగంగా ఏడాది పొడవునా అన్ని కాలాల్లోనూ బాదం పప్పులను నిరభ్యంతరంగా తినవచ్చు.
 
నిపుణులు సైతం సమతుల్య పోషకాహార విధానంలో బాదం పప్పులను విస్తృతంగా సిఫార్సు చేస్తున్నారు. న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్ డైటెటిక్స్ రీజినల్ హెడ్ రితికా సమాద్దర్ వివరిస్తూ.. ఉదయం నిద్రలేవగానే మన దినచర్యను ఎలా ప్రారంభిస్తామన్నది రోజంతా మన శరీరం పనిచేసే విధానంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. సరైన పోషణతో కూడిన స్థిరమైన సమతుల్య దినచర్య వల్ల.. రోజంతా శక్తి స్థాయిలు ఉత్సాహంగా ఉండటం దగ్గరి నుంచి, సాఫీగా సాగే జీర్ణక్రియ, దీర్ఘకాలిక ఆరోగ్య ఫలితాల వరకు ప్రతిదీ ప్రభావితం అవుతుంది. రోజువారీ ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండే సూపర్ ఫుడ్స్‌ను చేర్చుకోవాలని నా వద్దకు వచ్చే రోగులందరికీ నేను సిఫార్సు చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది అత్యంత సులభమైన మార్గాలలో ఒకటి అని అన్నారు.
 
రోజువారీ ఆరోగ్యానికి పోషకాలతో కూడిన సూపర్ ఫుడ్
కాలిఫోర్నియా బాదం పప్పులలో విటమిన్ ఇ, ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం, రైబోఫ్లావిన్, ఫాస్పరస్ మరియు జింక్ వంటి 24 పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల సమృద్ధి కారణంగా బాదం పప్పులు ఆధునిక జీవనశైలికి సులభంగా సరిపోయే ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్‌గా మారాయి.
 
బాదంలో ఉండే ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ కలయిక.. శరీరానికి నిరంతర పోషణను అందించడంతో పాటు ఎక్కువసేపు కడుపు నిండిన భావనను ఇస్తుంది. ఈ కారణాల వల్ల పగటి పూట తినడానికి బాదం ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. పూర్తిగా ప్రాసెస్ చేయబడిన ఆహారం తిన్నప్పుడు శరీరంలో ఒక్కసారిగా శక్తి స్థాయిలు పెరగడం, వెంటనే పడిపోవడం జరుగుతుంది. కానీ బాదం విషయానికి వస్తే అలా జరగదు. పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, లేదా చురుకైన జీవనశైలిలో ఉన్నా సరే.. బాదం అందించే స్థిరమైన పోషణ మన శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని నిరంతరం అందిస్తూనే ఉంటుంది.
 
రోజువారీ ఆహారంలో బాదం పప్పులను చేర్చుకోవడం వల్ల కలిగే పోషక ప్రయోజనాలను పరిశోధనలు సైతం స్పష్టం చేస్తున్నాయి. యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. రోజూ 43 గ్రాముల డ్రై-రోస్ట్ చేసిన, కొద్దిగా ఉప్పు చల్లిన బాదం పప్పులను తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. అంతేకాకుండా, శరీర బరువు పెరగకుండానే విటమిన్ ఇ, మరియు మోనోశాచురేటెడ్ (మంచి) కొవ్వులు శరీరానికి అందుతాయి.
 
బాదం పప్పులను నానబెట్టాలా?
బాదం పప్పులకు సంబంధించి తరచుగా తలెత్తే మరో ప్రశ్న.. వాటిని తినడానికి ముందు, ముఖ్యంగా ఎండాకాలంలో, నానబెట్టాలా వద్దా? అనేది. నానబెట్టిన బాదం పప్పులు మృదువుగా, నమలడానికి సులభంగా ఉండటం వల్ల చాలామంది వాటినే ఇష్టపడతారు. అయితే, బాదం పప్పులను నానబెట్టడం అనేది కేవలం వాటి మృదుత్వం, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయమే తప్ప, పోషకాల పరంగా తప్పనిసరి నియమం ఏమీ కాదు. నానబెట్టినా లేదా నానబెట్టకపోయినా, సమతుల్య ఆహారానికి తోడ్పడే అదే విలువైన పోషకాలను బాదం పప్పులు అందిస్తాయి.
 
రోజువారీ ఆరోగ్యానికి తోడ్పాటు
విస్తృత ప్రయోజనాలతో పాటు, బాదం పప్పులు అనేక పోషక ప్రయోజనాలను అందిస్తాయి. బాదం పప్పులు ప్రొటీన్‌కు అద్భుతమైన వనరు, ఇది ఎముకలను సాధారణ స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే మజిల్ మాస్ పెరుగుదలకు మరియు నిర్వహణకు తోడ్పడుతుంది. ముఖ్యంగా పిల్లలలో ఎముకల సాధారణ పెరుగుదల మరియు అభివృద్ధికి ఈ ప్రొటీన్ అత్యంత అవసరం.
 
బాదం పప్పులలో లభించే మరో ముఖ్యమైన పోషకం మెగ్నీషియం. ఇది కండరాలు మరియు నరాలు సాధారణంగా పనిచేయడానికి సహాయపడుతుంది, ఈ లక్షణాల వల్లే ఆరోగ్యంపై దృష్టి సారించే జీవనశైలికి బాదం ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. వాటిలో ఉండే పోషక సాంద్రత, సౌలభ్యంతో కలిపి.. అల్పాహారంలో, వ్యాయామం చేసిన తర్వాత, లేదా పండుగ మరియు కుటుంబ భోజనాలలో కూడా బాదం పప్పులను ఇష్టంగా తినవచ్చు.
 
ముగింపు
బాదం పప్పులు శరీరంలో వేడిని పుట్టిస్తాయనేది ముఖ్యంగా వేసవి కాలంలో చాలామంది నమ్మే ఒక సాధారణ ఆహారపు అపోహ మాత్రమే. వాస్తవానికి బాదం పప్పులు పోషకాలతో నిండిన ఒక అత్యుత్తమ ఆహారం, దీనిని సమతుల్య జీవనశైలిలో భాగంగా సంవత్సరం పొడవునా అన్ని కాలాల్లోనూ ఆస్వాదించవచ్చు.
 
బాదం పప్పులు వేడి చేస్తాయా లేదా చలువ చేస్తాయా అనేదానిపై అనవసరంగా ఆలోచించడం కంటే, రోజువారీ ఆహారంలో అవి అందించే మొత్తం పోషక విలువలపై దృష్టి పెట్టడం ఎంతో ఉపయోగకరం. ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, మెగ్నీషియంలతో నిండి ఉండే కాలిఫోర్నియా బాదం పప్పులు.. ఎక్కువసేపు కడుపు నిండిన భావనను ఇవ్వడమే కాకుండా, రోజువారీ ఆరోగ్యానికి తోడ్పడే పూర్తిస్థాయి పోషణను అందిస్తాయి. సమతుల్యమైన ఆహారపు అలవాట్లలో భాగంగా, కాలానుగుణ మార్పులతో సంబంధం లేకుండా, ప్రతిరోజూ గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తీసుకోవడం వల్ల మీ దినచర్య ఎంతో సంతృప్తికరంగా మారుతుంది.
About Writer
జయ
Content provider.... మరింత చదవండి