సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 30 మే 2023 (12:13 IST)

వెకేషన్ కి వెళ్లిన ఖాళీగా ఉండని ఎన్టీఆర్

Ntr zym
Ntr zym
ఎన్టీఆర్ తన పుట్టిన రోజున ఫామిలీ మెంబెర్స్ తో సెలెబ్రేట్ చేసుకున్నారు. తన తాత సీనియర్ ఎన్టీఆర్ జయంతి నాడు ట్యాంక్ బండ్ వద్ద నివాళి అర్పించారు. అక్కడే చాలాసేపు గడిపారు. కానీ కళ్యాణ్ రామ్ జాడ లేదు తాను విదేశాల్లో ఉన్నాడని తెలుస్తోంది. కాగా.. 'దేవర' సినిమాకు సంబందించి షూటింగ్  బ్రేక్ తీసుకున్నారు ఎన్టీఆర్.  అదే రోజు మే 28నే విదేశాలకు ఫ్యామిలీతో కలిసి లాంగ్ ఫారెన్ ట్రిప్పుకెళ్లారు. అక్కడకు వెళ్లినా ఖాళీగా ఉండలేదు. జిమ్ లో వర్క్ ఔట్స్ దేస్తూ  ఇలా కనిపించారు 
 
NTR at airport
NTR at airport
తిరిగి రాగానే యాక్షన్ సీన్స్ తీయనున్నారు దర్శకుడు కొరటాల శివ. విదేశాల్లో ఫైట్ మాస్ట్రర్ లను కలిసి కొన్ని మెళుకువలు నేర్చు కుంటున్నాడని తెలుస్తోంది. అందుకే సోషల్ మీడియాలో దేవర గ్రూప్.. మా దేవర అసలు ఖాళీగా ఉండదు అని పోస్ట్ చేసింది. ఎన్టీఆర్ టీం సమాచారం ప్రకారం ఎన్టీఆర్ వారం రోజుల్లో వచ్చేస్తారని సమాచారం.