గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 30 జులై 2024 (09:31 IST)

డ్రైనేజీ సమస్యపై డా,. రాజశేఖర్ ఫిర్యాదు - అదే బాటలో సురేష్ బాబు

Dr. Rajasekar house
Dr. Rajasekar house
జూబ్లీహిల్స్ లోని ప్రముఖుల ఇళ్ళముందు, స్టూడియోల ముందు డ్రైనేజీ లీకేజ్ కావడం జరుగుతుంది. గతంలో పలు సార్లు డి.సురేష్ బాబు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. రామానాయుడు స్టూడియో గేటు బయట చాలా మురుగునీరు పారుతుండేది. స్టూడియోకు వచ్చే విలేకరులతోనూ ఆయన తన గోడును విన్నించుకునేవారు.  ఆంగ్ల పత్రికలో పలు సార్లు వేయించారు. ఇక నేడు డా. రాజశేఖర్ కూడా పరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి తన ఆవేదనను సోషల్ మీడియా ఎక్స్.. (ట్విట్టర్)లో పేర్కొన్నాడు. 
 
 అశ్విని హైట్స్, రోడ్ నెం. 70, జూబ్లీహిల్స్, 500033 వద్ద ఎప్పటి నుంచో డ్రైనేజీ లీక్ అవుతోంది. మేము పలు సార్లు అధికారులతో మాట్లాడాము.  దాన్ని పరిష్కరించడానికి, ఇది ఇంకా పూర్తి కాలేదు. అందుకే కమిషనర్ GHMC వారిని అభ్యర్థిస్తున్నాను. దయచేసి, వెంటనే దానిని పరిశీలించండి అంటూ..  జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ ఆన్‌లైన్‌లను ట్యాగ్ చేశారు.