శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 16 డిశెంబరు 2018 (10:10 IST)

ఇపుడే పెళ్లా... మరికొంత సమయం ఆగాల్సిదే : పరిణీతి చోప్రా

ఇటీవలి కాలంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు, హీరోయిన్లు ఒక్కొక్కరుగా ఓ ఇంటివారైపోతున్నారు. ఈ కోవలోకి యువ హీరోయిన్ పరిణీతి చోప్రా కూడా చేరబోతుందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ మేరకు మీడియాలో కథనాలు వచ్చాయి. ఇవి వైరల్ కావడంతో పరిణీతి చోప్రా పెదవి విప్పారు. 
 
తన పెళ్లి గురించి సాగుతున్న ప్రచారం, వస్తున్న వదంతులన్నీ పూర్తిగా నిరాధారమైనవన్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. నేను పెళ్ళి చేసుకోవాలని అనుకున్న‌ప్పుడు సంతోషంగా ఎనౌన్స్ చేస్తా అని తెలిపింది. 
 
ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం ప్రియాంక చోప్రా సోద‌రి ప‌రిణితీ చోప్రా కొద్ది రోజులుగా చారిట్ దేశాయ్ అనే వ్య‌క్తితో డేటింగ్‌లో ఉంద‌ని, ఆయ‌న ఇటీవ‌ల జరిగిన ప్రియాంక‌ పెళ్లికి హాజ‌ర‌య్యాడ‌ని రాశారు. ఆ వ్యక్తి ప‌రిణీతి ఫ్యామిలీకి న‌చ్చ‌డంతో త్వ‌ర‌లోనే వివాహం జ‌ర‌ప‌నున్నార‌ని ప్ర‌చురించారు. 
 
చారిట్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్నాడ‌ని స‌మాచారం. పెళ్లి వార్త‌ల‌ని ప‌రిణీతి చోప్రా కొట్టి పారేసిన నేప‌థ్యంలో ఆమె పెళ్లి కోసం అభిమానులు కొన్నాళ్ళు ఎదురు చూడ‌క త‌ప్ప‌దు.