ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 23 ఆగస్టు 2018 (14:37 IST)

అక్కను బాగా ప్రేమించు బావా... నిన్ను పిచ్చిగా ప్రేమిస్తోంది...

హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా, అమెరికా సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడనుంది. ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం కూడా ముగిసింది. నిజానికి గ‌తంలో అమెరికాలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట తాజాగా ముంబైలో హిం

హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా, అమెరికా సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడనుంది. ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం కూడా ముగిసింది. నిజానికి గ‌తంలో అమెరికాలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట తాజాగా ముంబైలో హిందూ సాంప్రదాయం ప్ర‌కారం కూడా ఆ కార్య‌క్ర‌మాన్ని ఇటీవల పూర్తి చేసింది. వీరిద్దరి వివాహం కూడా త్వరలోనే జరుగనుంది. ఆ తర్వాత ప్రియాంక త‌న బాలీవుడ మిత్రుల‌కు ఘ‌నంగా పార్టీ ఇచ్చింది.
 
ఈ సంద‌ర్భంగా ప్రియాంక సోద‌రి, బాలీవుడ్ హీరోయిన్ ప‌రిణీతి చోప్రా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. 'అక్కా, నేను చిన్న‌ప్ప‌టి నుంచి చాలా క్లోజ్. చిన్న‌ప్ప‌టి నుంచి ప్రేమ‌లో ఉండే మేజిక్‌ను మేం బాగా న‌మ్మేవాళ్లం. మంచి జీవిత భాగస్వామి గురించి క‌ల‌లు క‌నేవాళ్లం. ఈ రోజు నుంచి అలాంటి క‌ల‌లు క‌నాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే నిక్‌.. నీ కంటే అక్క‌కు ప‌ర్‌ఫెక్ట్ ప‌ర్స‌న్ ఎవ‌రూ ఉండ‌ర‌ని అనుకుంటున్నాను. అక్క‌ను బాగా ప్రేమించు. ఎందుకంటే అక్క నిన్ను పిచ్చిగా ప్రేమిస్తోంది. అక్క బ‌య‌ట‌కు స్ట్రాంగ్‌గా క‌నిపించినా.. త‌ను చాలా సెన్సిటివ్‌. హ్యాపీ మేరీడ్ లైఫ్' అంటూ ప‌రిణీతి భావోద్వేగంగా స్పందించింది.