శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 14 మే 2016 (18:11 IST)

పవన్ కళ్యాణ్ అప్పుడు రేణూ దేశాయ్‌కి ఇచ్చాడు... ఇప్పుడు శ్రుతి హాసన్‌కు కూడా... ఏంటది?

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటే చర్చ. పవన్ కళ్యాణ్ తన మాజీ భార్య రేణూ దేశాయ్‌కు ఇచ్చినట్లు ఇప్పుడు శ్రుతి హాసన్‌కి కూడా ఇచ్చాడంటూ చెప్పుకుంటున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఇచ్చినది ఏంటయా అంటే... తన పక్కన హీరోయిన్‌గా నటించే ఛాన్స్. సర్దార్ గబ్బర్ సింగ్

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటే చర్చ. పవన్ కళ్యాణ్ తన మాజీ భార్య రేణూ దేశాయ్‌కు ఇచ్చినట్లు ఇప్పుడు శ్రుతి హాసన్‌కి కూడా ఇచ్చాడంటూ చెప్పుకుంటున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఇచ్చినది ఏంటయా అంటే... తన పక్కన హీరోయిన్‌గా నటించే ఛాన్స్. సర్దార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడిపోవడంతో పవన్ కళ్యాణ్ రెట్టించిన కసితో ఎస్.జె.సూర్యతో కలిసి కొత్త సినిమాకు ప్లాన్ చేశాడు. 
 
ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక కూడా చకచకా చేసేశాడు. గతంలో హీరోయిన్‌గా ఎవరినైనా ఎంపిక చేయాలంటే కాస్త టైం తీసుకునే పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం ఆట్టే గ్యాప్ తీస్కోకుండా వెంటనే ఫైనలైజ్ చేసేశాడు. గతంలో తన పక్కన రెండోసారి నటించే ఛాన్స్ రేణూ దేశాయ్ కి మాత్రమే కల్పించిన పవన్ ఇప్పుడు అలాంటి ఛాన్సునే శ్రుతి హాసన్ కు ఇచ్చాడు. దీనితో శ్రుతి హాసన్ ఏమాత్రం ఆలోచన చేయకుండా సంతకం చేసేసిందట. అదీ సంగతి.