శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2016 (16:55 IST)

కాజల్ అగర్వాల్‌తో పవన్ కల్యాణ్ పెళ్లి.. ఎక్కడ.. ఎప్పుడు?

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో భాగంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను పవన్ కల్యాణ్ పెళ్లి చేసుకున్నాడు. తాజాగా రామోజీ ఫిలిమ్ సిటీలో ఈ సన్నివేశం షూటింగ్ జరుగుతోంది. దర్శకుడు బాబి ఈ సీన్స్ షూటింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఫిలిమ్ సిటీలోని గుడి పరిసరాలో భారీ సెట్ వేసి ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్లోనే పవన్ కళ్యాణ్, కాజల్‌లపై పెళ్లి సన్నివేశం చిత్రీకరించారు. 
 
గబ్బర్ సింగ్ సినిమాలో శ్రుతిహాసన్‌తో పెళ్లి జరిగినట్లే.. సర్దార్‌లోనూ కాజల్ అగర్వాల్‌తో అనుకోకుండా పవన్ పెళ్లి జరుగుతుందని తెలిసింది. ‘సర్దార్’కు సంబంధించి ప్రతి సన్నివేశం కూడా భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారని.. సీన్ సీన్లోనూ హడావుడి, హంగామా ఉండేలా చూస్తున్నారని యూనిట్ సభ్యులు అంటున్నారు. 
 
‘గబ్బర్ సింగ్’కు ఏమాత్రం తగ్గని రీతిలో మంచి ఎంటర్టైనర్‌లా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట. షూటింగ్ శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో అనుకున్నట్లే ఏప్రిల్ 8న సర్దార్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.