సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 16 ఫిబ్రవరి 2017 (20:48 IST)

'కాటమరాయుడు' మళ్లీ కదిలాడు...

పవన్‌ కళ్యాణ్‌ 'కాటమరాయుడు' చిత్రం చిత్రీకరణలో వుండగానే విదేశాలకు వెళ్ళాడు. దాంతో షెడ్యూల్‌కు గ్యాప్‌ వచ్చింది. ఐదు రోజుల పర్యటన అనంతరం తిరిగి వచ్చిన ఆయన చిత్రీకరణలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన స్టిల్‌ను విడుదల చేశారు. దర్శకుడు డాలి పవన్‌ పైన చిత

పవన్‌ కళ్యాణ్‌ 'కాటమరాయుడు' చిత్రం చిత్రీకరణలో వుండగానే విదేశాలకు వెళ్ళాడు. దాంతో షెడ్యూల్‌కు గ్యాప్‌ వచ్చింది. ఐదు రోజుల పర్యటన అనంతరం తిరిగి వచ్చిన ఆయన చిత్రీకరణలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన స్టిల్‌ను విడుదల చేశారు. దర్శకుడు డాలి పవన్‌ పైన చిత్రీకరించాల్సిన ముఖ్య సన్నివేశాలను మొదలుపెట్టారు. 
 
పనిలో పనిగా చిత్ర ప్రమోషన్ల వేగం పెంచింది. వ్యాలెంటైన్స్‌ డే సందర్భంగా పవన్‌, శృతిలు కలిసున్న స్టిల్‌ను రిలీజ్‌ చేసిన టీమ్‌ ఈరోజు జరుగుతున్న చిత్రీకరణ తాలూకు ఫోటోలను సైతం విడుదల చేసింది. మార్చి నాటికి పూర్తిచేసి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. తమిళ స్టార్‌ అజిత్‌ నటించిన 'వీరమ్‌'కు రీమేక్‌గా ఈ చిత్రం వస్తోంది.
 
ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ కావడంతో ఇందులో ఏ పాయింట్‌ను టచ్‌ చేస్తున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. కాగా, చిత్ర ఓపెనింగ్స్‌ రికార్డ్‌ స్థాయిలో ఉండొచ్చని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.