శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (15:16 IST)

విక్రమ్ వేద రీమేక్‌లో పవన్.. విజయ్ సేతుపతిని ఒప్పిస్తాడా?

vikram veda
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రీమేక్‌‌ల బాట పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వకీల్ సాబ్ పేరిట ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో మరో రీమేక్ సినిమాలో నటించేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కోలీవుడ్‌లో వచ్చిన విక్రమ్ వేద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
విజయ్ సేతుపతి - మాధవన్ కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా హక్కులను రామ్ తాళ్లూరి సొంతం చేసుకున్నారు. 
 
ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి పాత్రకిగాను పవన్‌ను ఒప్పించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడట. పవన్ ఓకే అంటే మరో పాత్రకిగాను రవితేజను అనుకుంటున్నట్టు తెలుస్తోంది. రామ్ తాళ్లూరికి.. పవన్‌కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడంతో, పవన్ అంగీకరించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా బాలీవుడ్‌లోనూ రీమేక్ అవుతుండటం విశేషం.