ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (18:13 IST)

గర్భందాల్చిన హీరోయిన్... కారణమైన హీరో ఎవరు? (Trailer Video)

ఓ హీరోయిన్ తనకు తెలియకుండానే గర్భందాల్చింది. దీనికి కారణం కూడా ఓ హీరోనే. ఇంతకీ ఆ హీరో ఎవరన్నదే ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. హీరోయిన్ గర్భానికి కారణమైన హీరోను కనిపెట్టే ప్రయత్నమే "పిల్-ఎ" చిత

ఓ హీరోయిన్ తనకు తెలియకుండానే గర్భందాల్చింది. దీనికి కారణం కూడా ఓ హీరోనే. ఇంతకీ ఆ హీరో ఎవరన్నదే ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. హీరోయిన్ గర్భానికి కారణమైన హీరోను కనిపెట్టే ప్రయత్నమే "పిల్-ఎ" చిత్రం కథ. పవన్ సాధినేని దర్శకత్వంలో ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. రొటీన్ కథలకు భిన్నంగా విభిన్న కథాశంతో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. 
 
యవ్వనంలో ఉండే ఓ యువతి స్నేహితులు, పార్టీలు, పబ్బులు అంటూ తిరగడంతోపాటు తనకు తెలియకుండానే గర్భందాల్చుతుంది. తాగిన మత్తులో ఆ రాత్రి ఏం జరిగింది? తాను గర్భందాల్చడానికి కారణం ఎవరు? ఆమె ఏవిధంగా ఆ విషయాన్ని తెలుసుకోగలిగింది? ఈ పరిణామక్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లు ఏమిటి? అన్నదే ఈ చిత్ర కథ అని దర్శకుడు పవన్ వివరించారు.