శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 5 సెప్టెంబరు 2018 (12:15 IST)

పూనమ్‌ పీకే లవ్ ఆగిపోయింది.. ఎందుకు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు, కృష్ణాష్టమి నేపథ్యంలో నటి పూనం కౌర్ పీకే లవ్ అంటూ ఓ వీడియోను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఎంతో నిజాయతీగా, సంతోషంతో వీడియోను రూపొందించానని పేర్కొంది. దానికి '

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు, కృష్ణాష్టమి నేపథ్యంలో నటి పూనం కౌర్ పీకే లవ్ అంటూ ఓ వీడియోను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఎంతో నిజాయతీగా, సంతోషంతో వీడియోను రూపొందించానని పేర్కొంది. దానికి 'పీకే లవ్' అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేసింది. కానీ ఊహించని విధంగా పూనంపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. 
 
పూనమ్ విడుదల చేయబోయే వీడియో పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. దీంతో, పూర్తిగా ఆవేదనకు గురైన పూనమ్ వీడియో విడుదలను ఆపేసింది. తాను తప్పు చేయలేకపోయినా.. తనను తిడుతున్నారని పూనమ్ ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎంతో ఇష్టపడి రూపొందించిన వీడియోను విడుదల చేయడం లేదని మరో ట్వీట్ ద్వారా తెలిపింది.  
 
కాగా పూనమ్ పీకే లవ్ అంటూ విడుదల చేయాలనుకున్న వెంటనే కొంతమంది నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. కొంతమంది అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారు. దీంతో పూనమ్ కలత చెంది.. ఈ నిర్ణయానికి వచ్చేసింది.