సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (13:47 IST)

ప్ర‌భాస్‌, మారుతీ సినిమా ప్రారంభం- హీరోయిన్‌గా మాళ‌విక మోహ‌న్ ?

Prabhas-Malavika
Prabhas-Malavika
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తాజా సినిమా ద‌ర్శ‌కుడు మారుతీ కాంబినేష‌న్‌లో శుక్ర‌వారంనాడు ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్‌లో సంస్థ కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించార‌ని స‌మాచారం. ఇందుకు అతి కొద్ద‌మింది మాత్ర‌మే హాజ‌రైన‌ట్లు తెలిసింది. హీరో ప్ర‌భాస్ అందుబాటులో లేక‌పోవ‌డంతో ద‌ర్శ‌కుడు మారుతీ చిత్ర నిర్మాత‌లు, ఫైనాన్సియ‌ర్లు హాజ‌రైన‌ట్లు స‌మాచారం.
 
మారుతీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే ఈ సినిమా పూర్తి కామెడీ చిత్రం మ‌లిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలోనే ప్ర‌భాస్ ఒక‌సారి మీడియాతో మాట్లాడుతూ, యాక్ష‌న్‌, రొమాంటిక్ సినిమాలు చేసేశాను. కుటుంబ‌క‌థల‌తో కూడిన సినిమాలు, అందులోనూ పూర్తిస్థాయి వినోదం క‌ల్గించే సినిమా చేయానుంద‌ని చెప్పాడు. ఇప్పుడు మారుతీ అందుకు త‌గిన‌ట్లుగానే క‌థ‌ను ప్ర‌భాస్‌కు చెప్పడం జ‌రిగింది.
 
అయితే మారుతీ ఇటీవ‌లే గోపీచంద్‌తో `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` సినిమా రూపొందించారు. అది పెద్ద‌గా ఆడ‌లేదు. దాంతో ఇక ప్ర‌భాస్ డేట్స్ ఇవ్వ‌డ‌మేన‌ని టాక్ ఫిలింన‌గ‌ర్‌లో బ‌లంగా విన‌ప‌బ‌డింది. కానీ ప్ర‌భాస్ చెప్పిన‌ట్లుగానే మారుతీ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నట్లుత తెలిసింది. ఇప్పుడు స‌లార్‌, ఆదిపురుష్‌, స్పిరిట్ చిత్రాల్లో బిజీగా వున్నాడు. మ‌రి మారుతీ సినిమా వ‌చ్చే ఏడాది సెట్‌పైకి వెళుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో మాళ‌విక మోహ‌న్ క‌థానాయిక‌గా న‌టించ‌నున్న వార్త వినిపిస్తోంది.