సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2022 (14:22 IST)

సత్యదేవ్, డాలీ ధనంజయ చిత్రంలో నాయికగా ప్రియా భవానీ శంకర్

Priya Bhavani Shankar
Priya Bhavani Shankar
వెర్సటైల్ హీరో సత్యదేవ్‌, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఒక కొత్త చిత్రం చేస్తున్నారు. నిర్మాతలు బాల సుందరం, దినేష్ సుందరం ఓల్డ్ టౌన్ పిక్చర్స్ వేన‌ర్ పై క్రిమినల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సత్యదేవ్, డాలీ ధనంజయ ఇద్దరికీ ఇది 26వ ప్రాజెక్ట్.
 
తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ని ప్రకటించారు నిర్మాతలు. ప్రియా భవానీ శంకర్  ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించనుంది. ఇది ప్రియా భవానీ శంకర్ తొలి తెలుగు చిత్రం కానుంది. ఇటీవలి బ్లాక్‌బస్టర్ గా నిలిచిన  తిరుతో సహా మరికొన్ని తమిళ చిత్రాలలో ఆమె నటించారు. అనౌన్స్ మెంట్ పోస్టర్‌పై ఉన్న వస్తువులను పరిశీలిస్తే- కుట్టు కొలిచే టేప్, కట్టర్ కనిపిస్తున్నాయి. ఇందులో ప్రియా ఫ్యాషన్ డిజైనర్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా వుండబోతున్నారు.
 
ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రాఫర్. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
సత్యదేవ్‌, ధనంజయ వైవిధ్యమైన పాత్రలతో అలరించి తమకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు. వీరిద్దరూ కలసి చేస్తున్న ఈ సినిమాపై సహజంగానే ప్రేక్షకుల్లో క్యూరీయాసిటీ నెలకొంది.