గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 17 ఆగస్టు 2017 (13:28 IST)

ఎంతమంది గగ్గోలు పెట్టినా లోనెక్ టాప్ ఫోటోను డిలీట్ చేయని ప్రియాంకా చోప్రా...

ప్రియాంకా చోప్రా అంటేనే చాలా బోల్డ్ స్టార్. ఆమె ఏమనుకుంటుందో అదే చేస్తుంది. తను అనుకున్నదాన్ని ఎవరైనా వేలు పెట్టి చూపిస్తే ఆ వేలు మడతడి పోవాల్సిందే. అంతేకానీ తను చేసిన దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది దాదాపు వుండదు. తాజాగా ప్రియాంకా చోప్రా తన ట్విట్టర్

ప్రియాంకా చోప్రా అంటేనే చాలా బోల్డ్ స్టార్. ఆమె ఏమనుకుంటుందో అదే చేస్తుంది. తను అనుకున్నదాన్ని ఎవరైనా వేలు పెట్టి చూపిస్తే ఆ వేలు మడతడి పోవాల్సిందే. అంతేకానీ తను చేసిన దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది దాదాపు వుండదు. తాజాగా ప్రియాంకా చోప్రా తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ ఫోటో చర్చనీయాంశంగా మారింది. 
 
జాతీయ పతాకాన్ని మెడలో వేసుకుని దాన్ని అలా పైకి లేపుతూ చూపిస్తూ ఓ ఫోటో దిగింది. జాతీయ జెండా వరకూ బాగానే వుంది కానీ ఆమె వేసుకున్న డ్రెస్సే చర్చకు దారి తీసింది. లోనెక్ టాప్ వేసుకుని జాతీయ జెండాను అలా పైకి లేపి పట్టుకోవడంపై నెటిజన్లు మండిపడ్డారు. 
 
జాతీయ పతాకాన్ని అగౌరవపరుస్తున్న ఆ ఫోటోను వెంటనే తొలగించాలని ట్వీట్లు చేశారు. కానీ ప్రియాంకా చోప్రా మాత్రం అదేమీ పట్టించుకోలేదు. తను పోస్ట్ చేసిన ఫోటోను అలాగే వుంచేసింది. ఎవరో చెప్పినట్లు మొండివాళ్లు రాజు కంటే బలవంతుడు... అదన్నమాట సంగతి.